
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం, జీవితంపై తన అభిప్రాయాలను తరచుగా సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. ఇటీవలే ఆమె నటించిన ‘సిటాడెల్ హన్నీ బన్నీ’ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలై ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ పొందింది. ఈ విజయంతో ఆమె పాన్-ఇండియా స్థాయిలో మరింత గుర్తింపు సంపాదించుకుంది. సినిమాలతో పాటు తన సొంత ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఓ కొత్త సినిమాను కూడా ప్రారంభించారు.
తాజాగా, సమంత భార్యాభర్తల బంధం, ఆరోగ్యంపై ఒక స్పష్టమైన సందేశంతో కూడిన వీడియోను షేర్ చేశారు. “మీరు మీ భాగస్వామితో మంచి బంధాన్ని కలిగి ఉండవచ్చు. కానీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోకపోతే, మీరు వారికి నిజమైన సపోర్ట్ ఇవ్వలేరు” అని ఆమె పేర్కొన్నారు. మనకు ఎదురుగా ఉన్న వ్యక్తి ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నట్లు అనిపించినా, అవును.. mental health matters too! మన మనసు, శరీరం ఆరోగ్యంగా లేకుంటే, ఆ బంధాన్ని కొనసాగించడం కష్టమవుతుందని ఆమె వివరించారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు, నెటిజన్లు ఈ సందేశాన్ని సమర్థిస్తూ “సమంత చాలా matured thought process కలిగిన వ్యక్తి” అని కామెంట్స్ చేస్తున్నారు. గతంలో వ్యక్తిగత జీవితంలో అనుభవించిన కష్టాలు ఆమెను మరింత బలంగా మార్చాయని, అందుకే ఈ మాటలు ఇంత లోతుగా ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
సమంత కెరీర్ పరంగా సక్సెస్ ఫుల్ ట్రాక్‌లో కొనసాగుతున్నారు. ‘సిటాడెల్’ సిరీస్ తర్వాత ఆమె తన ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఓ కొత్త సినిమాను మొదలుపెట్టారు. అంతేకాకుండా, పాన్-ఇండియా స్థాయిలో మరిన్ని కొత్త ప్రాజెక్టులు సైన్ చేశారు. త్వరలో ఆమె నుంచి మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉంది!