Daaku Maharaaj: ‘డాకు మహారాజ్‌’ చిత్రంపై ‘కలర్‌ ఫొటో’ దర్శకుడు కీలక పోస్ట్..

  • బాలకృష్ణనటిస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్’
  • బాలయ్య కెరీర్ లో 109వ సినిమా
  • కీలక పాత్ర పోషించిన దర్శకుడు సందీప్‌ రాజ్‌

గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణనటిస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్’. బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా వస్తున్న ఈ సినిమాకు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై హై అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర ప్రొడక్షన్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. శ్రద్ద శ్రీనాధ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తుండగా, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

READ MORE: Gujarat: ‘‘ఆమెకు గుణపాఠం చెప్పండి’’..భార్య వేధింపులతో మరో వ్యక్తి బలి..

ఈ చిత్రంలో కలర్‌ ఫొటో సినిమా దర్శకుడు సందీప్‌ రాజ్‌ కీలక పాత్ర పోషించాడు. ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్‌ వేదికగా తెలిపాడు. ఇటీవల విడుదలైన ‘డాకు మహారాజ్’ ట్రైలర్‌లో తాను కనిపించిన ఫ్రేమ్‌ను షేర్‌ చేశాడు. తనకు ఈ అవకాశం రావడంపై సంతోషం వ్యక్తం చేశాడు. సినిమా బృందానికి ధన్యవాదాలు తెలిపాడు. విజయవాడకు చెందిన తాను పాఠశాలకు వేళ్లేటప్పటి నుంచే సినిమాల్లోకి రావాలని కలలు కన్నాను. బాలయ్య బాబు సినిమాతో ఇప్పుడు నటుడిగా పరిచకం కావడం సంతోషంగా ఉంది. నా కల సహకారమయ్యేందుకు కృషి చేసిన బాబీ అన్నకి రుణపడి ఉంటా. సినిమా డైరెక్టర్ నాగవంశీకి ధన్యవాదాలు” అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్‌పై ‘డాకు మహారాజ్’ దర్శకుడు హరీశ్‌ శంకర్‌ సరదాగా స్పందించారు. ‘‘బిగ్‌ ఫిల్మ్‌ కోసం ఫస్ట్‌ ఆడిషన్‌ చేసింది ఎవరు బాబు..? అని కామెంట్‌ చేశాడు. “సందీప్‌.. నీ విషయంలో చాలా ఆనందంగా ఉన్నాను. అద్భుతమైన విజువల్స్‌తో బాబీ అదరగొట్టేశారు. నట సింహాం బాలకృష్ణ ప్రదర్శన వేరే లెవల్‌. తమన్‌ బావా.. బాలయ్య అంటే నీకు పూనకాలు వచ్చేస్తాయి కదా” అని పేర్కొన్నారు.

READ MORE:Anantha Sriram: హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలను తిరస్కరించాలి..

ఇదిలా ఉండగా.. సుహాస్, చాందిని చౌదరి జంటగా సందీప్ రాజ్ దర్శహకత్వంలో తెరకెక్కిన చిత్రం కలర్ ఫోటో. సాయి రాజేశ్ నీలం, బెన్నీ ముప్పనేని నిర్మించిన ఈ సినిమా 2020 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని నమోదు చేసుకోంది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ చిత్రం ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ చిత్రం జాతీయ అవార్డును నదుకోవడం విశేషం. కలర్ ఫోటో చిత్రంలో లాగే తనూ ఎన్నో అవమానాలుపడ్డాడని.. అందుకే సున్నితమైన అంశాన్ని కథాంశంగా ఎంచుకున్నానని ఆ సినిమా దర్శకుడు సందీప్ రాజ్ గతంలో తెలిపాడు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *