Published on Dec 30, 2024 7:00 AM IST
మన టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్నటువంటి టాప్ మోస్ట్ స్టార్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు. మరి ఎలాంటి పాన్ ఇండియా సినిమా చేయకుండా పాన్ ఇండియా సినిమాలు ఊపందుకోని సమయంలో ఇంటర్నేషనల్ హీరోస్ లెవెల్ చరిష్మా సాలిడ్ యాక్షన్ కటౌట్ గా మహేష్ పేరు తెచ్చుకున్నాడు. అయితే లేటెస్ట్ గా దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి సినిమా RRR డాక్యుమెంటరీ చూసి చాలా మంది మహేష్ విషయంలో సింపుల్ గా కామెంట్స్ చేసేస్తుండడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రాజమౌళి RRR కోసం చరణ్, తారక్ లని ఓ రేంజ్ లో కష్టపెట్టారని మహేష్ రాజమౌళి కోసం ఆ రేంజ్ డెడికేషన్ చూపిస్తారా అంటూ చాలా మంది అనుమానిస్తున్నారు. అయితే అలా కామెంట్స్ చేసేవారు డెఫినెట్ గా మహేష్ బాబు ఫిల్మోగ్రఫీ కోసం పూర్తిగా తెలియని వారే అయ్యుండొచ్చని చెప్పాలి.
ఎస్ మహేష్ బాబు సున్నితమే కావచ్చు కానీ సినిమా కోసం ఆ సినిమాలో తన రోల్ డిమాండ్ చేస్తే ఎక్కడ వరకు అయినా వెళ్ళగలరు. అందుకు చక్కటి ఉదాహరణలే తన సినిమాలు “టక్కరి దొంగ”, “1 నేనొక్కడినే” అని చెప్పాలి. టక్కరి దొంగ సినిమాలో మహేష్ తన చిన్న ఏజ్ లో ఎన్నో ప్రాణాంతక సాహసాలు ఎలాంటి డూప్స్ లేకుండా ఇప్పుడున్నంత టెక్నాలజీ కూడా లేని సమయం చేసి వదిలేసారు.
సరే అది తనకి అది కొత్త కాబట్టి అంత కష్టపడ్డాడు అనుకోవచ్చు కానీ 1 నేనేనొక్కడినే వచ్చి ఒక దశాబ్దం అయ్యింది. ఆ సినిమా కోసం మహేష్ ఇచ్చిన డెడికేషన్ కూడా అంతా ఇంతా కాదు మొదటిసారి ఆ సినిమా కోసం మహేష్ షర్ట్ లెస్ గా మారడం అప్పట్లో ఒక సెన్సేషనల్ ఆ సినిమాలో తన స్టంట్స్, బైక్ ఛేజింగ్ సీన్స్ గాని ఓ రేంజ్ లో హైలైట్ అయ్యాయి.
మరి అప్పట్లోనే ఇంటెర్నేషనల్ లెవెల్లో డెడికేషన్ ని తాను చూపించారు. ఈ లెక్కన తనకి తగ్గ సరైన సినిమా పడితే తాను ఎక్కడివరకు అయినా వెళ్తారు. మరి అలాంటిది రాజమౌళి లాంటి దర్శకునితో అందులోని గ్లోబల్ లెవెల్లో సినిమాకి అంటే డెఫినెట్ గా తన ఎఫర్ట్స్ ఏ లెవెల్లో ఉండొచ్చో అర్ధం చేసుకోవాలి. సో మహేష్ డెడికేషన్ శంకిస్తే అది ఖచ్చితంగా తప్పే అవుతుంది అని చెప్పొచ్చు.