ఓజి.. కవర్ పోస్టర్‌తో విధ్వంసానికి తెరలేపిన పవన్! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రెస్టీజియస్ చిత్రం ‘ఓజి’ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తుండగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సినిమా రానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్ ఈ సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్‌లో క్రియేట్ చేశాయి.

ఈ అంచనాలను మరింత పెంచేస్తూ.. సినిమాపై హైప్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తూ తాజాగా ఓ సాలిడ్ కవర్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా ముందు విధ్వంసం సృష్టించి మరణ మృదంగం మోగించిన ఓజిని మనకు ఇందులో చూపెట్టారు. పవన్‌ని డార్క్ షేడ్స్‌లో చూపెట్టినా, అభిమానులకు ఈ కవర్ పోస్టర్ పిచ్చపిచ్చగా ఎక్కేసింది. ఇక ‘‘ఈ దారులు తిరిగి ఎప్పటికీ మళ్లీ అలా కనిపించవు’’ అనే క్యాప్షన్‌ను ఈ పోస్టర్‌కు జత చేశారు.

దీంతో ఈ సినిమాలో యాక్షన్ డోస్ ఏ లెవెల్‌లో ఉండబోతుందో ఈ శాంపిల్ కవర్ పోస్టర్‌తో అర్థం చేసుకోవచ్చు. ఇక ఓజి పోస్టర్ ప్రస్తుతం నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో అందాల భామ ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. డివివి దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

The post ఓజి.. కవర్ పోస్టర్‌తో విధ్వంసానికి తెరలేపిన పవన్! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *