మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇపుడు భారీ బడ్జెట్ విజువల్ వండర్ చిత్రం “విశ్వంభర” చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తుండగా ఇపుడు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో అయితే బిజీగా ఉంది.
ఇక ఈ సినిమా తర్వాత చిరు లైనప్ పై మెగా ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. తన తోటి ఉన్న సీనియర్ దర్శకులు అంతా సాలిడ్ లైనప్ ని సెట్ చేసుకోగా చిరు నుంచి ఇంకా ఎవరితో వర్క్ చేయనున్నారు అనే ఇతర వివరాలు మాత్రం ఇంకా గోప్యంగానే ఉన్నాయి. అయితే ఇపుడు ఓ క్రేజీ బజ్ మెగాస్టార్ నెక్స్ట్ పై వినిపిస్తుంది.
దీని ప్రకారం అయితే యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మెగాస్టార్ తో వర్క్ చేయనున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. “దసరా” తో సాలిడ్ డెబ్యూ ఇచ్చిన ఈ యువ దర్శకుడు ఇపుడు నానితో “ప్యారడైజ్” చేస్తున్నాడు. మరి ఈ క్రేజీ కలయికలోనే సినిమా ఉంటుంది అన్నట్టుగా ఇపుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతమేరకు నిజం అనేది వేచి చూడాలి.
The post మెగాస్టార్ నెక్స్ట్ పై క్రేజీ బజ్..యువ దర్శకునితో సాలిడ్ ప్రాజెక్ట్!? first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.