Published on Dec 6, 2024 3:04 PM IST
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ అలాగే శ్రద్దా శ్రీనాథ్ సహా చాందిని చౌదరిలు ముఖ్య పాత్రల్లో దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన భారీ చిత్రమే “డాకు మహారాజ్”. మరి గట్టి అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని దర్శకుడు బాబీ ఊహించని రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడని ముందు నుంచీ టాక్ ఉంది. ఇలా సినిమాలో ప్రతీ అంశాన్ని పక్కాగా ప్లాన్ చేస్తుండగా ఇపుడు ఓ క్రేజీ బజ్ అయితే సినిమాపై వినిపిస్తుంది.
దీని ప్రకారం ఈ సినిమాలో ఆడియెన్స్ ని థ్రిల్ చేసే విధంగా క్రేజీ క్యామియో ఎపిసోడ్స్ ఉంటాయని తెలుస్తుంది. మన టాలీవుడ్ లో ప్రెజెంట్ ఉన్న కొందరు యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరోస్ అయితే డాకు మహారాజ్ లో సర్ప్రైజ్ ఇవ్వనున్నారట. మరి వారు ఎవరు ఏంటి అనేది డైరెక్ట్ థియేటర్స్ లోనే విట్నెస్ చేయనున్నారట. మరి దీనిపై మరిన్ని డీటెయిల్స్ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.