చరణ్ సినిమా పై క్రేజీ న్యూస్ ? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Dec 24, 2024 10:00 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ భారీ చిత్రం రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ రీసెంట్‌గా మైసూర్ నగరంలో జరిగింది. వచ్చే షెడ్యూల్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ భారీ సెట్ ను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్ లో చరణ్ పై ఇంట్రో సీన్స్ ను షూట్ చేస్తారట. అన్నట్టు ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నారట.

కాగా ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ సరసన హీరోయిన్ గా జాన్వీకపూర్‌ నటించబోతుంది. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ సినిమాకి నిర్మాణం వహిస్తున్నారు. అన్నట్టు యానిమల్ సినిమాతో విలన్ గా ఫామ్ లోకి వచ్చిన బాబీ డియోల్ కూడా ఈ సినిమాలో నటించే ఛాన్స్ ఉందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *