వైరల్: హ్యాండ్సమ్ మేకోవర్ తో అదరగొట్టిన బాలయ్య వారసుడు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Dec 1, 2024 9:00 PM IST

నటసింహం బాలయ్య బాబు వారసుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఐతే, ఈ క్రేజీ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ?, ఎప్పుడు రిలీజ్ అవుతుంది ? అంటూ నందమూరి ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం జనవరి మూడో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. మొదటి షెడ్యూల్ లో మోక్షజ్ఞ పై ఓ సాంగ్ కి సంబంధించి కొన్ని మాంటేజ్ షాట్స్ తీస్తారట.

ఇప్పటికే ఈ సినిమాలో మోక్షజ్ఞ లుక్‌ ను మేకర్స్ రివీల్ చేయగా అది చాలా బాగా ఆకట్టుకుంది. కాగా ప్రశాంత్ వర్మ సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ లోనే ఈ ప్రాజెక్ట్ కూడా ఉండబోతుందని టాక్. అంటే.. ఇండియన్ మైథాలజీలో ఉన్న క్యారెక్టర్స్ బేస్ చేసుకొని ఓ సూపర్ హీరో కథతో ఈ సినిమా ఉంటుందట. మొత్తమ్మీద నందమూరి అభిమానులు మాత్రం ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *