- సంక్రాంతి కానుకగా “సంక్రాంతికి వస్తున్నాం”
- ప్రమోషన్స్ ను మొదలు పెట్టిన మేకర్స్
- జనవరి 6న ఎంటర్టైనింగ్ ట్రైలర్
Sankranthiki Vasthunnam : వెంకటేశ్ హీరోగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ చిత్రంలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, మీనాక్షి చౌదరి లేడి పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్, దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 14న రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ను మొదలు పెట్టారు మేకర్స్. అందులో భాగంగానే ఈ సినిమాలోని ‘గోదారి గట్టుమీద రామసిలకవే గోరింటాకు ఎట్టుకున్న సందమామవే’ సాగె ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ప్రముఖ పాటల రచయిత భాస్కరభట్ల ఈ సాంగ్ ను రచించగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.
Read Also:Sabarimala: శబరిమలకు వెళ్లే భక్తులకు అలెర్ట్.. అయ్యప్పస్వామి దర్శనానికి 10 గంటలు!
కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమా సంక్రాంతి స్పెషల్ గా రాబోతుంది. ఐతే, ఈ కథకి అనుకున్న మొదటి హీరో వెంకటేష్ కాదు అని, మెగాస్టార్ చిరంజీవి అని అనిల్ రావిపూడి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. మెగాస్టార్ అప్పటికే ఒప్పుకున్న వరుస సినిమాల కారణంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ చేయలేకపోయారట. అలా ఈ సినిమా చివరకు వెంకటేష్ దగ్గరకు వచ్చింది. ఐతే, అనిల్ రావిపూడి తన తర్వాత సినిమాని మెగాస్టార్ తో చేయబోతున్నాడు. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా విషయానికి వస్తే.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ విత్ క్రైమ్ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో వెంకటేశ్ మాజీ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. ఆయన భార్యగా ఐశ్వర్య, మాజీ ప్రేయసిగా మీనాక్షి నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Also:AUS vs IND: లంచ్ బ్రేక్ సమయానికి ఆసీస్ స్కోరు ఎంతంటే..?