‘విజయ్ దేవరకొండ’ సినిమా పై క్రేజీ అప్ డేట్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Dec 23, 2024 10:00 AM IST

శ్యామ్ సింగ రాయ్ ఫేమ్ ‘రాహుల్ సంకృత్యాన్’ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్ పై లేటెస్ట్ అప్ డేట్ తెలిసింది. వచ్చే ఏడాది జనవరి నాలుగో వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూట్ స్టార్ట్ కానుందని, మొదటి షెడ్యూల్ లో విజయ్ పాత్రకు సంబంధించిన ఇంట్రో సీన్ ను అలాగే, హీరో క్యారెక్టర్ ఎలివేషన్స్ ను షూట్ చేస్తారని టాక్. అన్నట్టు ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కోసం రాహుల్ సంకృత్యాన్ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో కొన్ని లొకేషన్స్ ను కూడా ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక, ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పూర్తిగా సరికొత్త గెటప్ లో కనిపిస్తాడని.. ముఖ్యంగా విజయ్ లుక్ చాలా కొత్తగా ఉంటుందని.. అలాగే, 1854-78 మధ్య కాలంలో జరిగే కథ కాబట్టి, సినిమాలో చాలా వేరియేషన్స్ ఉంటాయని తెలుస్తోంది. పైగా ఆర్నాల్డ్ వోస్లూ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. మరి నిజంగానే ఆయన ఈ సినిమాలో నటిస్తే కచ్చితంగా ఈ సినిమాకి ప్లస్ అవుతుంది. ఎంతైనా ‘రాహుల్ సంకృత్యాన్’ దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన శ్యామ్ సింగ రాయ్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దీంతో, విజయ్ దేవరకొండ సినిమా పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *