Published on Jan 5, 2025 6:00 PM IST
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా అలాగే దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన లేటెస్ట్ పవర్ఫుల్ ప్రాజెక్ట్ చిత్రమే “డాకు మహారాజ్” కోసం అందరికీ తెలిసిందే. మరి భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ మాస్ ట్రైలర్ కట్ ని రిలీజ్ చేయగా దీనికి ఇపుడు అభిమానులు సహా మాస్ ఆడియెన్స్ నుంచి ఓ రేంజ్ రెస్పాన్స్ అయితే వస్తుంది.
ఇక ఈ ట్రైలర్ తర్వాత అంచనాలు మరింత లెవెల్లోకి మారిపోయాయి. అయితే ఈ ట్రైలర్ లో బాలయ్యని బాబీ నెవర్ బిఫోర్ గా ప్రెజెంట్ చేయడం అనేది కేజ్రీగా మారింది. మెయిన్ గా బాలయ్య వింటేజ్ లుక్ ని చూపించడం ఫ్యాన్స్ ని ఓ రేంజ్ లో ఎగ్జైట్ చేసింది అని చెప్పాలి. మరి దీనితో బాలయ్య నుంచి ఒక రుద్ర తాండవంనే మేకర్స్ ప్రామిస్ చేస్తున్నారని చెప్పాల్సిందే. ఇక ఈ జనవరి 12న ఎలా ఉంటుందో చూడాల్సిందే.