నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన లేటెస్ట్ సాలిడ్ యాక్షన్ చిత్రం “డాకు మహారాజ్” కోసం అందరికీ తెలిసిందే. మరి భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాతో బాలయ్య మరో హ్యాట్రిక్ కొట్టాలని ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ ఆల్రెడీ స్టార్ట్ కాగా ఈ సినిమా నుంచి మేకర్స్ రెండో పాటని ఇప్పుడు రిలీజ్ చేసేసారు. చిన్ని అంటూ సాగే ఈ సాంగ్ బ్యూటిఫుల్ గా ఉందని చెప్పాలి.
అయితే యూట్యూబ్ కంటే ముందే పలు సాంగ్స్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లలోకి వచ్చేసిన ఈ సాంగ్ ఒక స్మూత్ మెలోడీగా ఉందని చెప్పాలి. బాలయ్యకి, ఓ చిన్న పాప నడుమ సాగే ఈ సాంగ్ కి థమన్ క్లీన్ బీట్స్ అలాగే సాంగ్ లోని సాహిత్యం ఇంపుగా అనిపిస్తున్నాయని చెప్పాలి. మరి బిగ్ స్క్రీన్స్ పై ఈ సాంగ్ డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. ఇక ఈ చిత్రానికి సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించగా ఈ జనవరి 12న సినిమా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.
లిరికల్ సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
The post “డాకు మహారాజ్” నుంచి క్లీన్ బీట్స్ తో సెకండ్ సింగిల్.. first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.