Published on Dec 29, 2024 5:01 PM IST
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా మరో హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్ సహా తెలుగు యంగ్ హీరోయిన్ చాందిని చౌదరి కీలక పాత్రలో దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “డాకు మహారాజ్” కోసం అందరికీ తెలిసిందే. మరి భారీ అంచనాలు నెలకొల్పుకోగా మేకర్స్ సాలిడ్ అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు. అయితే ఈ చిత్రంలో ప్రముఖ బ్యూటీ ఊర్వశి రౌటేలా కూడా ఉన్న సంగతి తెలిసిందే.
అయితే తనపైనే నెక్స్ట్ సాంగ్ బాలయ్యతో ప్లాన్ చేసిన మూడో సాంగ్ ని లాంచ్ చేస్తున్నట్టుగా మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చేసారు. మరి బాలయ్య, ఊర్వశిపై మంచి మసాలా పోస్టర్ ని రిలీజ్ చేసి సాంగ్ ని యూఎస్ గ్రాండ్ ఈవెంట్ లో లాంచ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. దీనితో ఈ సాంగ్ జనవరి 4న యూఎస్ లో రిలీజ్ చేస్తుండగా ఇండియాలో 5న రాబోతుంది. మరి థమన్ ఇచ్చిన ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.