‘డాకు మహారాజ్’ యూఎస్ బుకింగ్స్ షురూ! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యింది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఈ మూవీ పై అంచనాలు పెంచాయి.

అయితే, ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులతో పాటు ఓవర్సీస్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ముఖ్యంగా యూఎస్‌లో నందమూరి బాలకృష్ణ సినిమాలకు ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. ఇక వారు ఈ సినిమాను చూసేందుకు ఆతృతగా ఉన్నారు. అయితే, తాజాగా యూఎస్‌లో ‘డాకు మహారాజ్’ టికెట్ బుకింగ్స్ తాజాగా తెరుచుకున్నాయి. దీంతో అక్కడి ఫ్యాన్స్ తమ అభిమాన హీరో సినిమాను వీలైనంత త్వరగా చూసేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తుండగా ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా ఈ మూవీ జనవరి 12న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది.

The post ‘డాకు మహారాజ్’ యూఎస్ బుకింగ్స్ షురూ! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *