
నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేయబోతోంది! జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. రూ. 160 కోట్లకు పైగా వసూళ్లతో, బాలయ్య మాస్ హంగామా థియేటర్లలో దుమ్ము రేపింది.
ఇప్పుడు, థియేటర్‌లో మిస్ అయిన అభిమానుల కోసం ఫిబ్రవరి 21న నుంచి డాకు మహారాజ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమా అందుబాటులోకి రానుంది. బాలయ్య అభిమానులు ఇప్పుడు ఇంట్లోనే ఈ మాస్ ఎంటర్టైనర్‌ను ఎంజాయ్ చేయొచ్చు!
ఈ సినిమాను త్రివిక్రమ్ శిష్యుడు కొల్లి బాబీ (కేఎస్ రవీంద్ర) డైరెక్ట్ చేశారు. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటించి ఆకట్టుకున్నాడు. ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి, సచిన్ ఖేడ్‌కర్, హిమజ, రవికిషన్ వంటి ప్రముఖ నటులు సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఎస్.ఎస్. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి హైలైట్ అయ్యింది.