బాలయ్య షోలో “డాకు మహారాజ్” టీం మాస్ ఎంటర్టైన్మెంట్! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Dec 29, 2024 9:34 PM IST

ఈ సంక్రాంతి కానుకగా టాలీవుడ్ నుంచి రాబోతున్న లేటెస్ట్ చిత్రాల్లో నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు బాబీ తెరకెక్కించిన అవైటెడ్ మాస్ చిత్రం “డాకు మహారాజ్” కూడా ఒకటి. మరి ఎన్నో అంచనాలు ఉన్న ఈ చిత్రం కోసం ఒక్క నందమూరి అభిమానులే కాకుండా మాస్ ఆడియెన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా మేకర్స్ ఓ రేంజ్ లో చేస్తుండగా ఇపుడు ఈ ప్రమోషన్స్ బాలయ్య హిట్ టాక్ షో అన్ స్టాపబుల్ వరకు కూడా వెళ్లాయి. మరి దర్శకుడు బాబీ, నిర్మాత నాగవంశీ అలాగే సంగీత దర్శకుడు థమన్ లు ఆహా అన్ స్టాపబుల్ లేటెస్ట్ షోలో లేటెస్ట్ గా సందడి చేశారు. మరి ఈ ఎపిసోడ్ మాత్రం మంచి మాస్ ఎంటర్టైన్మెంట్ ని అందిస్తుంది అన్ని చెబుతున్నారు. మరి ఈ ఎపిసోడ్ తాలూకా స్ట్రీమింగ్ డేట్ ఏంటి అనేది త్వరలోనే అనౌన్స్ కానుంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *