• సంక్రాంతికి రిలీజ్ కు డాకు మహారాజ్ రెడీ
  • ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్
  • జనవరి 12న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

సీనియర్ హీరోలలో సూపర్ హిట్స్ తో టాప్ లో దూసుకెళ్తున్నారు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం అయన తన 109వ చిత్రం బాబీ దర్శకత్వంలో చేస్తున్నారు. హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాకు ‘డాకు మహారాజ్’ అనే టైటిల్ తో రానుంది ఈ సినిమా. ఈ సినిమాలో బాలకృష్ణను మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో కనిపించబోతున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Also Read : Manchu Family Issue : మంచు ఫ్యామిలీ వివాదంపై CP సుధీర్ బాబు రియాక్షన్

కాగా ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ను భారీ ఎత్తున చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ అందించారు నిర్మాతలు. బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ నెల 14న అనగా రాబోయే శనివారం రోజున విడుదల చేస్తామని పోస్టర్ రిలీజ్ చేసారు. సినిమాలో బాలయ్య క్యారక్టర్ యొక్క పాత్రని వివరిస్తూ ఈ సాంగ్ ఉంటుందని తెలుస్తోంది. అయితే సహజంగానే బాలయ్య సినిమా అంటేనే మ్యూజిక్ తో మెస్మరైజ్ చేసే థమన్ డాకు మహారాజ్ ఫస్ట్ సాంగ్ కు తమన్ దుమ్ములేచే మ్యూజిక్ ఇస్తాడని బాలయ్యఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫస్ట్ సింగిల్ ప్రోమోను రేపు ఉదయం 10.08 గంటలకు రిలీజ్ చేయనున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *