టాలీవుడ్ యంగ్ హీరోలలో సక్సెస్ రేట్ ఏక్కువ ఉన్న హీరోలలో అడివి శేష్ ఎప్పుడు మొదటి స్తానం ఉంటారు.విభిన్న కథలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాలు అందించాడు అడివి శేష్. అదే జోష్ లో ఆ మధ్య డెకాయిట్ అనే సినిమానుప్రకటించాడు. ఈ సినిమాలో అడివి శేష్ సరసన హీరోయిన్ గా శృతి హాసన్ ను తీసుకున్నట్టు అధికారకంగా ప్రకటిస్తూ ఓ వీడియో కూడా రిలీజ్ చేసారు మేకర్స్. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో డెకాయిట్ : ఎ లవ్ స్టోరీ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
కొన్నాళ్లుగా ఈ సినిమా నుండి శృతి హాసన్ తప్పుకుంది అనే వార్తలు హల్ చల్ చేసాయి. అయితే అధికారకంగా మేకర్స్ ఎక్కడ ధ్రువీకరించలేదు. ఇక లేటెస్ట్ ఈ మంగళవారం అడవి శేష్ బర్త్ డే సందర్భంగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ఈ పోస్టర్ లో అడివి శేష్ పక్కన మాస్క్ ధరించి గన్ పట్టుకుని ఉన్న మరొక హీరోయిన్ దర్శనం ఇచ్చింది. దీంతో శృతి హాసన్ ఈ సినిమా నుండి తప్పుకుంది అనే వార్తలకు బలం చేకూరింది. అయితే పోస్టర్ లో ఉన్న హీరోయిన్ ఎవరు అనే దానిపై ఇప్ప్పుడు చర్చ నడుస్తోంది. కొందరు ఆమె మృణాల్ ఠాకూర్ అని, కాదు ఫరియా అని మరికొందరు, కాదు తమిళ హీరోయిన్ అని ఇలా ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్స్ చేస్తున్నారు. రేపు రిలీజ్ చేయనున్న పోస్టర్ లో ఆ హీరోయిన్ ఎవరు అనేది క్లారిటీ రానుంది.