Dance Icon 2 latest elimination update
Dance Icon 2 latest elimination update

ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ షోకు రోజురోజుకీ ప్రేక్షకుల ఆదరణ పెరుగుతోంది అయితే తాజాగా మూడో ఎపిసోడ్ లో జరిగిన ఎలిమినేషన్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది మొదటి ఎలిమినేషన్ అకస్మాత్తుగా జరగడంతో షోను వీక్షిస్తున్న ప్రేక్షకులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు

షోలో ఎవరు ఎలిమినేట్ అయ్యారు

ఈ డాన్స్ రియాలిటీ షోలో మొత్తం ఐదుగురు మెంటార్లు ఉన్నారు అయితే ప్రతి మెంటర్ కు ఒక్కో పార్టిసిపెంట్ మాత్రమే ఉంది తాజాగా మూడో ఎపిసోడ్ లో మెంటార్ జాను లిరి కంటెస్టెంట్ షోనాలి ఎలిమినేట్ అయ్యారు ఈ ఊహించని పరిణామం జడ్జిలు ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసింది

కొత్త ట్విస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ

ఇక మెంటర్ ప్రకృతి కంభం కంటెస్టెంట్ బర్కత్ అనారోగ్య సమస్యల కారణంగా షోలో పాల్గొనలేకపోయారు ఈ నేపథ్యంలో హోస్ట్ ఓంకార్ బర్కత్ స్థానంలో వర్తికా ఝాను పరిచయం చేశారు తన ఎనర్జిటిక్ డాన్స్ తో వర్తికా ఆడియెన్స్ ను అలరించింది

రాబోయే ఎపిసోడ్స్ లో మరిన్ని సర్ ప్రైజ్ లు

జాను లిరి షోనాలి ఎలిమినేషన్ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీతో కొత్త ట్విస్ట్ ఉండనుందని సమాచారం రాబోయే ఎపిసోడ్స్ లో మరిన్ని సస్పెన్స్ మూమెంట్స్ సెన్సేషనల్ పర్ఫార్మెన్సెస్ తో షో మరింత ఆసక్తికరంగా మారనుంది

By admin