‘కంగువా’కి ఏఐ సాయంతో డబ్బింగ్‌ ! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

హీరో సూర్య హీరోగా రాబోతున్న చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ ఎపిక్ యాక్షన్ డ్రామా ఆడియో లాంచ్ ఈవెంట్ పై క్లారిటీ వచ్చింది. ఈ నెల అక్టోబర్ 26న చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో సాయంత్రం 6 గంటల నుండి ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్‌ ప్రారంభమవుంతుందని మేకర్స్ ప్రకటించారు. ఈ ఈవెంట్‌ లో స్పెషల్ అట్రాక్షన్ కోసం సూపర్ స్టార్ రజనీకాంత్, ప్రభాస్‌లను సంప్రదించినట్లు జ్ఞానవేల్ రాజా గతంలో వెల్లడించారు. మరి వారు వస్తారో రారో చూడాలి.

కాగా ఈ సినిమాలో దిశా పఠానీ కథానాయికగా నటిస్తోంది. బాబీ దేవోల్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఫాంటసీ యాక్షన్‌ ఫిల్మ్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా నవంబర్‌ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. అయితే, ఇప్పటికే, పార్ట్ 2, పార్ట్‌ 3 కథలు సిద్ధంగా ఉన్నాయని, కంగువా పార్ట్‌ 1 విజయం ఆధారంగా వాటిని తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నామని నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ చెప్పుకొచ్చారు.

The post ‘కంగువా’ ఆడియో లాంచ్ ఎప్పుడంటే ? first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *