సాలిడ్ అప్డేట్ ఇచ్చిన SDT18.. టైటిల్ అండ్ గ్లింప్స్ వచ్చేది ఆ రోజే! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. SDT18 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను రోహిత్ డైరెక్ట్ చేస్తు్న్నాడు. ఈ సినిమా సాయి దుర్గ తేజ్ కెరీర్‌లోనే హై బడ్జెట్ మూవీగా రానుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్స్, మేకింగ్ వీడియో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశాయి.

అయితే, ఈ సినిమా నుండి మేకర్స్ తాజాగా ఓ కీలక ప్రకటన చేశారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, గ్లింప్స్‌ను రిలీజ్ చేసేందుకు వారు డేట్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా గ్లింప్స్‌తో పాటు టైటిల్‌ను డిసెంబర్ 12న రిలీజ్ చేయబోతున్నట్లు వారు ఓ పవర్‌ఫుల్ ప్రీ-లుక్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ పోస్టర్ చూస్తుంటే, సాయి దుర్గ తేజ్ ఈసారి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని అనిపిస్తుంది.

ఇక ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా హనుమాన్ చిత్ర నిర్మాతలు నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

The post సాలిడ్ అప్డేట్ ఇచ్చిన SDT18.. టైటిల్ అండ్ గ్లింప్స్ వచ్చేది ఆ రోజే! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *