Published on Dec 7, 2024 7:04 AM IST
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తో చేసిన నాలుగో సినిమానే “పుష్ప 2 ది రూల్”. మరి వీరి కాంబినేషన్ అంటే ఉండే అంచనాలకి తగ్గట్టుగా ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ అనుకున్న అంచనాలు రీచ్ అయ్యి సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది. భారీ హైక్స్ కూడా ఉన్నప్పటికీ పుష్ప రాజ్ కొట్టిన డెబ్భై ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులు వచ్చి పడ్డాయి.
మరి ఇపుడు వరకు ఇండియన్ సినిమా దగ్గర ఆల్ టైం హైయెస్ట్ ఓపెనింగ్స్ ఉన్న సినిమాగా “RRR” చిత్రం 223 కోట్లతో ఉంటే ఇపుడు దీనిని అనుకున్నట్టుగానే పుష్ప రాజ్ బ్రేక్ చేసాడు. వరల్డ్ వైడ్ గా డే 1 పుష్ప 2 కి ఏకంగా 294 కోట్లకి పైగా వసూళ్లు వచ్చి ఇండియన్ సినిమా దగ్గర కనీవినీ ఎరుగని ఆల్ టైం రికార్డు నమోదు అయ్యింది.
ఒక హిందీ, కన్నడ, మళయాళ భాషల్లో కూడా పుష్ప 2 ఆల్ టైం రికార్డ్ ఓపెనింగ్స్ నే అందుకున్నట్టు మేకర్స్ చెప్తున్నారు. అలాగే యూఎస్ మార్కెట్ లో కూడా ఈ ఏడాదికి హైయెస్ట్ ఓపెనింగ్స్ ని పుష్ప 2 సాధించి దుమ్ము లేపింది. ఇలా మొత్తంగా మాత్రం ఆల్ టైం రికార్డ్స్ తో వేట మొదలైంది అని చెప్పాలి.