ఈ 2024వ సంవత్సరంలో సినీ పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ఘట్టాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. డిసెంబర్ నెల విషయానికి వస్తే
డిసెంబర్ 4: ‘పుష్ప-2’ సినిమా ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి, కోమాలోకి ఆమె కుమారుడు శ్రీతేజ్
డిసెంబర్ 6: ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజును తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ.
డిసెంబర్ 7: నటి చాందినీ రావ్ తో దర్శకుడు సందీప్ రాజ్ వివాహం
డిసెంబర్ 8: సంధ్య థియేటర్ దుర్ఘటనలో బాధ్యులైన థియేటర్ భాగస్వామి, మేనేజర్, బాల్కనీ ఇన్ ఛార్జ్ ల అరెస్ట్
డిసెంబర్ 8: మోహన్ బాబు కుటుంబంలో హైడ్రామా.. తనపై తండ్రి ఆయన అనుచరులు దాడిచేశారంటూ మనోజ్ ఆరోపణలు.. ప్రైవేట్
హాస్పిటల్ కు వెళ్ళి వైద్యం చేయించుకున్న మనోజ్
డిసెంబర్ 9: పరస్పరం పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టుకున్న మంచు మనోజ్, మోహన్ బాబు
డిసెంబర్ 9: నటి స్రవంతితో నటుడు సాయికిరణ్ వివాహం
డిసెంబర్ 10: మోహన్ బాబు నివాసం వద్ద మనోజ్ పైన, మీడియా పైన దాడి
డిసెంబర్ 12: చిరకాల స్నేహితుడు ఆంటోనీతో గోవాలో కీర్తి సురేశ్ వివాహం
డిసెంబర్ 13: సంధ్య థియేటర్ లో అల్లు అర్జున్ ను అరెస్ట్..
కోర్టు 14 రోజుల రిమాండ్..
అయితే క్వాష్ పిటీషన్ లో మధ్యంతర బెయిల్ మంజూరు
డిసెంబర్ 14: తెల్లవారు జామున 6 గంటలకు చంచల్ గూడ జైలు నుంచి ఇంటికి అల్లు అర్జున్
డిసెంబర్ 14: జర్నలిస్ట్ కుటుంబానికి క్షమాపణలు చెబుతూ మోహన్ బాబు లేఖ విడుదల
డిసెంబర్ 15: బిగ్ బాస్ సీజన్ -8 విజేతగా బుల్లితెర నటుడు నిఖిల్
డిసెంబర్ 18: తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా దిల్ రాజు ప్రమాణ స్వీకారం
డిసెంబర్ 21: యశ్ పాల్ వీరగోనితో బిగ్ బాస్ ఫేమ్ సోనియా ఆకుల వివాహం
డిసెంబర్ 21: తెలంగాణ అసెంబ్లీలో అల్లు అర్జున్ వైఖరిపై మండిపడ్డ సీఎం రేవంత్ రెడ్డి
డిసెంబర్ 22: సంధ్య థియేటర్ దుర్ఘటనలో అల్లు అర్జున్ ప్రమేయం ఉందని రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు మీడియా సమావేశం
డిసెంబర్ 23: బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ. 50 లక్షల విరాళం అందించారు.
డిసెంబర్ 23: చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్ళి మరోసారి స్టేట్ మెంట్ ఇచ్చిన అల్లు అర్జున్
డిసెంబర్ 25: శ్రీతేజ్ కుటుంబానికి అల్లు అర్జున్ కోటి రూపాయలు, దర్శకుడు సుకుమార్ రూ. 50 లక్షలు అందచేత 26: తెలంగాణ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు సమావేశం
డిసెంబర్ 29: దేశంలోనే అతి పెద్దదైన ఫిల్మ్ కటౌట్ ను విజయవాడలో ఆవిష్కరణ