Mon. Oct 13th, 2025
Deepika- Alia: దీపికా ఔట్.. అలియా ఇన్ !

హీరోయిన్ హీరోయిన్ మధ్య పోటీ గురించి చెప్పాల్సిన పని లేదు. ట్రెండ్ మారేకొద్ది హారోయిన్‌లు మారుతూ ఉంటారు. అయితే ప్రజంట్ బాలీవుడ్ బ్యూటీ దీపికను అనూహ్యంగా కల్కి 2 నుంచి తప్పిస్తూ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించడం కలకలం రేపింది. కల్కిలో సుమతిగా, కల్కికి జన్మ ఇవ్వబోయే తల్లిగా అద్భుతంగా నటించిన దీపిక. అలాంటిది కల్కి 2లో దీపిక ఉండరని తెలిసి ఆమె అభిమానులు షాక్ అయ్యారు. దీంతో పాటుగా ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న స్పిరిట్ నుంచి కూడా దీపిక తప్పుకున్నారు. ఈ నిర్ణయం వెనుక కారణాలు ఏమిటన్న దానిపై సినీ వర్గాల్లో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రజంట్ ‘కల్కి-2’ చిత్రంలో హీరోయిన్ మార్పు హాట్ టాపిక్‌గా మారింది..

అయితే సమాచారం ప్రకారం, అలియా భట్ ఈ పాత్రను పోషించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ మేరకు చిత్రబృందం మరియు అలియా మధ్య చర్చలు జరుగుతున్నట్లు ముంబయి సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అన్ని వివరాలు ఖరారైన తర్వాతే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ‘కల్కి-2’లో దీపికా స్థానంలో పలువురు అగ్ర తారల పేర్లు వినిపించినా, ప్రస్తుతం అలియా పేరే బలంగా వినిపిస్తోంది. ఇక ఈ సినిమా టైటిల్‌గా ‘కర్ణ 3102 బీసీ’ అనే పేరు పరిశీలనలో ఉందని కూడా సమాచారం. జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీపికా వైదొలగడం, అలియా ఎంట్రీ ఈ పరిణామాలతో ‘కల్కి-2’ పై హాలీవుడ్ స్థాయి క్రేజ్ మరింత పెరిగిపోయింది. ప్రజంట్ అలియా సైలెంట్ గా ప్రాజెక్ట్ లు ఓకే చేస్తూ వస్తోంది. ఇప్పుడు ‘కల్కి-2’ లో కూడా ఓకే అయితే ఆమె కెరీర్ లో మరో మైలురాయిగా నిలుస్తోంది.