Devara: ఒక్క ఏపీలోనే “దేవర” సంచలన రికార్డు!? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Oct 22, 2024 3:03 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ హిట్ అయ్యి కొరటాల శివకి సాలిడ్ కం బ్యాక్ లా కూడా నిలిచి అదరగొట్టింది. అయితే ఈ సినిమా రిలీజ్ రోజునే కొంచెం మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే భారీ వసూళ్లు నమోదు చేసింది.

అయితే లేటెస్ట్ గా దేవర మరో సంచలన రికార్డుని సెట్ చేసినట్టుగా తెలుస్తుంది. దేవర ఒక్క ఆంధ్ర రాష్ట్రం నుంచే 100 కోట్లకి పైగా షేర్ ని (జి ఎస్ టి కలిపి) రాబట్టినట్టుగా తెలుస్తుంది. బాక్సాఫీస్ దగ్గర 25 రోజుల రన్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పటికీ సాలిడ్ రన్ ని కంటిన్యూ చేస్తూ వస్తుంది.

ఇలా ఒక్క ఏపీ నుంచే 100 కోట్ల షేర్ ని రాబట్టిన మూడో సినిమాగా దేవర నిలిచిందట. మరి దీనికి ముందు RRR, బాహుబలి 2 లు నిలవగా ఒక్క ఏపీ నుంచి రెండు 100 కోట్ల షేర్ సినిమాలు ఉన్న హీరోగా తారక్ భారీ రికార్డు సెట్ చేసాడు. మొత్తానికి అయితే పార్ట్ 1 తోనే తారక్ యునిక్ రికార్డులు నెలకొల్పుతున్నాడు అని చెప్పాలి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *