Published on Dec 4, 2024 11:11 AM IST
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” కోసం తెలిసిందే. అయితే ఈ చిత్రం పార్ట్ 1 గా మొదట థియేటర్స్ లోకి వచ్చి సోలోగా ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచి అదరగొట్టింది. ఇక ఈ చిత్రం థియేటర్స్ లో మంచి వసూళ్ల తర్వాత ఓటిటిలో రిలీజ్ కి వచ్చింది.
అయితే ఈ సినిమా థియేటర్స్ తర్వాత ఓటిటిలో వచ్చి అదరగొట్టింది. దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం ఇపుడు ఓటిటిలో సాలిడ్ రెస్పాన్స్ ని అది కూడా గ్లోబల్ లెవెల్లో అదరగొడుతున్నట్టుగా మేకర్స్ చెబుతున్నారు. అయితే ఈ సినిమాని ఇటీవల గ్లోబల్ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కి తీసుకురాగా లేటెస్ట్ గా అయితే నాలుగు వారాలు కంటిన్యూగా నెట్ ఫ్లిక్స్ లో పలు దేశాల్లో ట్రెండ్ అవుతున్న సినిమాగా దేవర నిలిచినట్టు మేకర్స్ చెప్తున్నారు.
మరి దేవర 2.8 మిలియన్ వ్యూస్ అలాగే 8.1 మిలియన్ హావర్స్ స్ట్రీమింగ్ చేసినట్టుగా తెలుపుతున్నారు. ఇలా మొత్తానికి అయితే దేవర సినిమా ఓటిటిలో కూడా మంచి రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది అని చెప్పాలి.