మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రమే “దేవర”. మరి తారక్ నుంచి సోలోగా వచ్చిన ఈ భారీ సినిమా టాక్ కెరీర్ లో భారీ వసూళ్లు సాధించి దుమ్ము లేపింది. మరి ఇంట్రెస్టింగ్ గా ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తో కూడా మొదలై తెలుగు రాష్ట్రాల్లో భారీ లాభాలు సాలిడ్ లాంగ్ రన్ ని అందుకుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి సెన్సేషనల్ ఓపెనింగ్స్ దక్కిన సంగతి తెలిసిందే.
మరి లేటెస్ట్ గా మరో భారీ పాన్ ఇండియా సినిమా పుష్ప 2 వచ్చినప్పటికీ దేవర సెట్ చేసిన పలు రికార్డ్స్ ఇంకా పదిలంగానే ఉన్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. ముఖ్యంగా ఏపీలో పలు ప్రాంతాల్లో అయితే దేవర సెట్ చేసిన కొన్ని రికార్డ్స్ ఇంకా చెక్కు చెదరలేదు అని తెలుస్తుంది. అలాగే మాస్ ఏరియాస్ లో కూడా దేవర సెట్ చేసిన రికార్డులు అలానే ఉన్నాయని తెలుస్తోంది. మొత్తానికి అయితే తారక్ మాస్ కూడా తగ్గేదేలే అని చెబుతుంది అని చెప్పాలి.
The post పలు చోట్ల “దేవర” రికార్డ్స్ ఇంకా పదిలం.. first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.