Published on Nov 15, 2024 2:57 AM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన రీసెంట్ మూవీ ‘దేవర’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ పూర్తి యాక్షన్ డ్రామాగా తెరకెక్కించగా, ఎన్టీఆర్ తన యాక్టింగ్‌తో ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటించాడు.

ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఎన్టీఆర్ రాకింగ్ పర్ఫార్మెన్స్‌కి అనిరుధ్ రవిచందర్ సాలిడ్ మ్యూజిక్ తోడవడంతో థియేటర్లలో ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించాయి. ఇప్పుడు ఈ సినిమా తాజాగా మరో కొత్త ఫీట్ సాధించింది. ఇటీవల కాలంలో 50 రోజులు పూర్తి చేసుకున్న సినిమాలు చాలా తక్కువ. అయితే, ఇఫ్పుడు దేవర 50 డేస్ సెలబ్రేషన్స్ జరుపుకుంటోంది. 52 సెంటర్లలో దేవర మూవీ 50 డేస్ పూర్తి చేసుకుంటోంది.

దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *