దసరాకి “దేవర” ర్యాంపేజ్.. | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Oct 22, 2024 4:35 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ హిట్ చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా తారక్ కెరీర్ లో సోలోగా బిగ్గెస్ట్ రికార్డులు కొల్లగొట్టి దుమ్ము లేపింది. మరి ఈ సినిమాకి ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ లలో సంగీత దర్శకుడు అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషించింది. సినిమాలో కేవలం నాలుగు పాటలే ఉన్నప్పటికీ ఒకొకటి చార్ట్ బస్టర్స్ ని అందించాడు.

అయితే ఈ సినిమాలో అన్ని పాటలు ఒకెత్తు ఆయుధ పూజ సాంగ్ ఒకెత్తు అన్నట్టు సస్పెన్స్ గా ఉంది రిలీజ్ కి తీసుకొచ్చారు. అయితే ఈ సాంగ్ ఆడియో పరంగా కంటే వీడియోగా థియేటర్స్ లో చూసాక పెద్ద హిట్ అయ్యింది. దీనితో ఈ సాంగ్ పై మంచి క్రేజ్ ఏర్పడగా ఫైనల్ గా అయితే ఈ సాంగ్ ని మేకర్స్ ఫుల్ వీడియో ఇచ్చేసారు. సోషల్ మీడియాలో ఒక సెలబ్రేషన్ గా నిలిచిన ఈ సాంగ్ ని అఫీషియల్ గా టి సిరీస్ వారు ఫుల్ వీడియో సాంగ్ ని తెలుగులో విడుదల చేశారు. మరి ఇది మాత్రం తారక్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ అని చెప్పాలి.

వీడియో కోసం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *