Danush : నన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టమంటున్న ధనుష్

  • తరచూ వార్తల్లో నిలుస్తున్న ధనుష్
  • నన్ను అర్థం చేసుకోవడం కష్టమంటున్న హీరో
  • వైరల్ అవుతున్న ధనుష్ కామెంట్స్

Danush : తమిళ స్టార్ హీరో ధనుష్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల ఆయన పై నయనతార పలు ఆరోపణలు చేస్తూ ఓ లేఖను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నయనతార జీవితంపై నెట్‌ ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీని రిలీజ్ చేసింది. దీనిలో, ‘నానుమ్ రౌడీ ధాన్’(తెలుగులో నేనూ రౌడీ నే) అనే సినిమాను ధనుష్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలోని ఓ మేకింగ్ సీన్ విజువల్స్ ను ఈ డాక్యుమెంటరీలో చూపించారు.

Read Also:BRS Leaders Arrested: అసెంబ్లీ గేట్టు వద్ద టీషర్ట్‌ రచ్చ.. బీఆర్ఎస్‌ నేతలు అరెస్ట్‌

అయితే, తన నిర్మాణంలో వచ్చిన సినిమాకు సంబంధించి మూడు సెకన్ల మేకింగ్ సీన్ విజువల్స్ ను నయనతార డాక్యుమెంటరీలో మేకర్స్ వాడారు. దీంతో తనకు రూ.10 కోట్లు నష్టపరిహారంగా ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు ధనుష్. ఈ క్రమంలోనే ధనుష్ పై నయనతార కొన్ని ఆరోపణలు కూడా చేసింది. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ధనుష్ తనను అర్థం చేసుకోవడం చాలా కష్టమంటూ సంచలన కామెంట్స్ చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ధనుష్ తనను అర్థం చేసుకోవడం చాలా కష్టమని తెలిపాడు.

Read Also:Super Star Of The Year : ‘సూపర్ స్టార్ ఆఫ్ ది ఇయర్’ ఎవరికి దక్కుతుందో తెలుసా ?

కానీ తనతో సన్నిహితంగా ఉండేవారికి మాత్రమే తానేంటో తెలుస్తుందని అన్నాడు. ఎవరికీ తాను అంత సులభంగా దగ్గర కాను.. అందుకు కొన్ని రోజుల సమయం పడుతుంది. తనతో సుధీర్ఘ కాలం పరిచయం ఉన్నవారే తనను అర్థం చేసుకుంటారు అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ధనుష్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *