- నాగ్ ధనుష్ కాంబోలో కుబేర
- నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్
- శేఖర్ కమ్ముల డైరెక్షన్లో భారీ మల్టీ స్టారర్
Kubera : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో రూపొందుతున్న సినిమా కుబేర. ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సినిమా పోస్టర్స్ ను చూస్తుంటే అర్థం అవుతుంది. ఈ సినిమాలో ధనుష్ లుక్‌తో పాటు ప్రతి ఎలిమెంట్ ఆకట్టుకునే విధంగా ఉండబోతున్నాయని చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్రలో నటించడం ద్వారా సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పైగా పుష్ప 2 వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన రష్మిక హీరోయిన్ గా చేస్తుండడంతో సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కుబేర సినిమాను ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావాలని మేకర్స్ ప్లాన్ చేస్తు్న్నారు. సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రమోషన్లు మొదలు పెట్టింది చిత్ర యూనిట్. మొదటగా హీరో ఇంట్రడక్షన్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందజేస్తున్నారు. మొదటి పాటను ధనుష్‌తో పాడించి అంచనాలను పెంచేశారు. గతంలో ధనుష్ పలు సార్లు తన సినిమాల్లో పాటలు పాడిన దాఖలాలు ఉన్నాయి. వాటిల్లో ఎక్కువ శాతం సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి. సినిమా ఫ్లాప్ అయినా ఆ పాటలు హైప్ క్రియేట్ చేశాయి. అందుకే కుబేర సినిమాకు ధనుష్ పాట ప్లస్ కాబోతుంది అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Read Also:2024 Mollywood : సత్తా చాటిన స్టార్ హీరోలు.. ఫ్రూవ్ చేసుకున్న యంగ్ హీరోలు
ధనుష్ పాట పాడితే సినిమాకు సెంటిమెంట్ కలిసి వస్తుందని చాలామంది నమ్మకం. ఈ సినిమాలోని ఇంట్రడక్షన్ సాంగ్‌కి చాలా ప్రాముఖ్యత ఉందట. అలాంటి పాటను ధనుష్ పాడటం వల్ల కచ్చితంగా సినిమాకు మంచి క్రేజ్ దక్కుతుందని అంటున్నారు. ఆ పాట విడుదలైన తర్వాత తెలుగు, తమిళ ప్రేక్షకులు కుబేర సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ వెయిట్ చేస్తున్నారు యూనిట్ సభ్యులు ఆఫ్ ది రికార్డ్ చెప్పుకొచ్చారు. శేఖర్ కమ్ముల అంటేనే విభిన్న చిత్రాలకు పెట్టింది పేరు. కనుక ఈ సినిమాతోనూ ఆయన మరోసారి కమర్షియల్‌గా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయమన్న నమ్మకాన్ని ఆయన అభిమానులు కలిగి ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాలో నాగార్జున లుక్ రివీల్ అయ్యింది. ధనుష్ లుక్ సినిమాపై ఆసక్తి పెంచింది. ఇక రష్మిక మందన్న ఫస్ట్ లుక్, ఆమె పాత్ర గ్లిమ్స్ సినిమా పై అంచనాలను మరింత పెంచాయి. ఈ మూడు పాత్రల మధ్య సాగే కథ ఏంటి, ఈ సినిమా నేపథ్యం ఏంటి అంటూ ఇప్పటికే అందరూ చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ధనుష్ పాడిన పాట వస్తే ఆసక్తి మరింత పెరగడం ఖాయం. కుబేర సినిమా టాలీవుడ్, కోలీవుడ్‌లోనే కాకుండా అన్ని భాషల్లోనూ విడుదల కానుంది.
Read Also:Happy Retirement: క్రికెట్కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీడ్కోలు.. ట్రెండింగ్లో హ్యాపీ రిటైర్మెంట్ రో-కో..