టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాల్లో మల్టీస్టారర్ మూవీగా రూపొందుతున్న ‘కుబేర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తుండటంతో ఆడియన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో స్టార్ క్యాస్టింగ్ కూడా ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి కారణమని చెప్పాలి.
అక్కినేని నాగార్జున, తమిళ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ‘కుబేర’ చిత్రంలో నటిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్ ఈ మూవీపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. అయితే, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
‘కుబేర’ చిత్రంతో ధనుష్ ఓ వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నాడని.. అతడి పాత్ర ఈ సినిమాకే హైలైట్‌గా నిలవనుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఈ సినిమా కోసం ధనుష్ యాక్టర్‌తో పాటు సింగర్ అవతారం కూడా ఎత్తాడట. ఈ చిత్రంలో ధనుష్ పాత్ర ఇంట్రో సాంగ్‌ను ఆయన స్వయంగా పాడినట్లుగా తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించాడని.. ఈ పాటను చెన్నైలోని ఓ స్టూడియోలో రికార్డు కూడా చేసినట్లు తెలుస్తోంది. మల్టీట్యాలెంటెడ్ యాక్టర్ ధనుష్ నుంచి రాబోతున్న ఈ సాంగ్‌కు ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
The post ‘కుబేర’ కోసం ధనుష్ మరో అవతారం..? first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.