
స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. హిట్ లేదా ఫ్లాప్ అనే అంచనాలను దాటి, తెలుగు, తమిళ్, హిందీ, హాలీవుడ్ వంటి భాషల్లో తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ప్రస్తుతం, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో “కుబేర” అనే తెలుగు చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా, కింగ్ నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన “కుబేర” ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
నటుడిగానే కాదు, దర్శకుడిగానూ ధనుష్ తన టాలెంట్‌ను నిరూపించుకుంటున్నారు. ఇటీవల “జాబిలమ్మ నీకు అంత కోపమా” అనే సినిమాకు దర్శకత్వం వహించి, మంచి విజయాన్ని అందుకున్నారు. అంతకు ముందు “రాయన్” అనే చిత్రానికి దర్శకత్వం వహించారు, ఈ సినిమా కూడా ప్రేక్షకుల మనసును గెలుచుకుంది. ఇప్పుడు, “ఇడ్లీ కడై” అనే కొత్త చిత్రాన్ని దర్శకత్వం వహించడమే కాకుండా, ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో నిత్యా మీనన్, అరుణ్ విజయ్, రాజ్ కిరణ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇటీవల ధనుష్ తన ఫేవరెట్ టాలీవుడ్ హీరో గురించి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక ఇంటర్వ్యూలో “నా ఫేవరెట్ హీరో ఎవరో చెప్పాలనుంది. కానీ, ఇతర అభిమానులు నన్ను తప్పుగా భావించకూడదు” అని ముందుగా చెప్పి, “పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం” అని తెలిపారు. ధనుష్ తాజా సినిమా “ఇడ్లీ కడై” షూటింగ్ శరవేగంగా జరుగుతోంది, దీని అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.