Published on Nov 7, 2024 2:10 PM IST
టాలీవుడ్ లో గత వారం వచ్చిన సినిమాలు సూపర్ సక్సెస్ ని సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కి వస్తున్న అవైటెడ్ సినిమానే “ధూం ధాం”. యువ హీరో హీరోయిన్స్ చేతన్ కృష్ణ, హేబా పటేల్ లు నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు సాయి కిషోర్ మచ్చ తెరకెక్కించారు. మరి రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ కూడా అందరినీ ఆకట్టుకోగా చిత్ర యూనిట్ ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్స్ ని చేస్తూ వస్తున్నారు.
అలా లేటెస్ట్ గా నిర్వహించిన ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో నిర్మాత రామ్ కుమార్ తమ సినిమా కోసం అలాగే చిత్ర యూనిట్ కోసం మాట్లాడ్డం జరిగింది. తమ సినిమాకి సాహిత్యం, బాణీలు అందించిన రామ జోగయ్య శాస్త్రి, గోపి సుందర్ లకి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని అలాగే ధూం ధాం సినిమా ఒక హిలేరియస్ ఎంటర్టైనర్, గత వారం వచ్చిన మూడు సినిమాలు మంచి హిట్స్ గా నిలిచాయి.
టాలీవుడ్ లో ఇలా ఒకే వారంలో వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ కావడం అనేది చాలా అరుదు. అయితే ఆ సినిమాల్లో ఒకటైన లక్కీ భాస్కర్ లో నటించిన సాయి కుమార్ గారు మా సినిమాలో కూడా ఉన్నారని ఆయన డైలాగ్ లోనే చెప్పాలంటే ఆ మూడు సినిమాలు తర్వాత వస్తున్న నాలుగో సినిమానే మాది అంటూ మంచి జోష్ నింపారు.
అలాగే చిన్నపుడు దేవుళ్ళు కోసం అమ్మ నాన్నలు చెబుతారు. తర్వాత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రేక్షక దేవుళ్ళు అంటూ ఆడియెన్స్ ని ఉద్దేశించి అన్నారు. ఈ ఇద్దరు దేవుళ్ళు తర్వాత మూడో దేవుడు ప్రింట్ అండ్ ప్రెస్ మీడియా అంటూ రామ్ కుమార్ వ్యాఖ్యానించారు. తాము ఆల్రెడీ మూడు ప్రీమియర్ షోస్ వేస్తే అన్ని చోట్లా మంచి రెస్పాన్స్ తమ సినిమాకి వచ్చింది అని రేపు వస్తున్న సినిమాకి ఆడియెన్స్ మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను అంటూ అందరికీ ధన్యవాదాలు తెలిపి వారు స్పీచ్ ముగించారు.