Published on Dec 22, 2024 10:41 AM IST
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రాబోతున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ ‘గేమ్ ఛేంజర్’. జనవరి 10, 2025న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఐతే, ఈ పొలిటికల్ డ్రామా నుంచి మరో సాంగ్ రిలీజ్ అయింది. డల్లాస్‌లో ప్రీరిలీజ్ వేడుక సందర్భంగా ‘దోప్’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించగా తమన్ స్వరాలు సమకూర్చారు. తమన్, రోషిణి జేకేవీ, పృథ్వీ, శ్రుతి రంజని ఆలపించారు.
మొత్తానికి ఈ ‘దోప్’ సాంగ్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ గేమ్ ఛేంజర్‌ను సౌండ్ ఛేంజర్‌గా మార్చేలా ఉంది. మొత్తమ్మీద ఈ ‘దోప్’ సాంగ్ తో మెగా ఫ్యాన్స్ లో జోష్ రెట్టింపు అయ్యింది. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలవుతున్న భారీ చిత్రాల్లో ఈ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. మరో కీలక పాత్రలో అంజలి కనిపించనుంది. అన్నట్టు గేమ్ ఛేంజర్ నార్త్ ఇండియా థియేటర్స్ రైట్స్ ను అనిల్ తడాని యొక్క AA ఫిల్మ్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి