మామయ్యలా టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు ఆ హీరో. తాను ఒకటనుంటే రిజల్ట్ మరోలా ఉంటుంది. ఓన్ ఇండస్ట్రీలో నేమ్ తెచ్చుకుంటున్నట్లుగా పొరుగు పరిశ్రమలో సత్తా చాటలేక చతికలబడుతున్నాడు. తన మామ, సీనియర్ స్టార్ యాక్టర్ అర్జున్ సర్జాలా సౌత్ ఇండస్ట్రీలో ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు యంగ్ హీరో ధ్రువ సర్జా. కానీ ప్లాన్స్ అన్నీ బెడిసి కొడుతున్నాయి. పొగరును శాండిల్ వుడ్‌తో పాటు కోలీవుడ్, టాలీవుడ్‌లో రిలీజ్ చేస్తే ఫలితం శూన్యం. ఒక్క చందన సీమలో మాత్రమే మంచి కలెక్షన్లు వసూళ్లయ్యాయి. మరోసారి ప్రయత్నిస్తే తప్పేంటీ అనుకొని మార్టిన్‌ను హిందీతో పాటు పలు భాషల్లో డబ్ చేశారు.
ధ్రువ సర్జా కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కింది మార్టిన్. సుమారు 80 కోట్లతో నిర్మిస్తే అందులో సగం కూడా వసూళ్లను రాబట్టలేకపోయింది. ఈ ఏడాది కన్నడ సీమలో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా నిలిచిపోయింది. స్టోరీ ఎక్కడో మిస్ ఫైర్ అయినట్లు గ్రహించిన ధ్రువ సర్జా. ఈసారి మంచి కథలను ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజెంట్ కేడీ డెవిల్ కంప్లీట్ చేసిన ఈ యంగ్ హీరో వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నాడు. ఎప్పుడో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై మూవీ ఎనౌన్స్ చేయగా ఎంత వరకు వచ్చిందో అప్ డేట్ లేదు. ఇప్పుడు ఓ టాలెంట్ దర్శకుడితో సినిమా చేయబోతున్నట్లు శాండిల్ వుడ్ వర్గాలంటున్నాయి. కెరెబెట్టాతో పేరు తెచ్చుకున్న డైరెక్టర్ రాజ్ గురుతో ధ్రువ్ నెక్ట్స్ సినిమా చేయబోతున్నాడని సమాచారం. మరీ ఈసారైనా టాలీవుడ్‌లో ఈ యాక్షన్ ప్రిన్స్ సక్సెస్ కొడతాడేమో చూడాలి.