SSMB 29: ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం ఈ పేరు తెలియని వారుండరు. సినిమాల చిత్రీకరణలో ఆయన రేంజే వేరు. ఆయన సినిమా అంటే చాలు.. ప్రతి చిన్న విషయంలో పెర్ఫెక్షనిజం కచ్చితంగా కనిపిస్తుంది. ఫస్ట్ పోస్టర్ నుంచి లాస్ట్ సినిమా ఎండ్ కార్డ్ పడే వరకు రాజమౌళి మార్క్ క్లియర్ గా కనిపిస్తుంది. అంతటి హార్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి.. ఎన్నో అవార్డులు, రివార్డులు, ఘనతలు అందుకున్నారు. బాహుబలి సిరీస్ చిత్రాలతోపాటు ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమాను ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డు తీసుకొచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. దీంతో తన అప్ కమింగ్ మూవీ SSMB 29 పై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలను క్రియేట్ చేశారు.
Read Also:Warangal: ఆర్టీఓకు కలెక్టర్ షోకాజ్ నోటీస్
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ఆ సినిమా.. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో సాగే అడ్వెంచర్ జర్నీగా తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. రీసెంట్ గా హైదరాబాద్ లో పూజా కార్యక్రమం ఎలాంటి హడావుడి లేకుండా జరిగింది. ఈ నెల చివర్లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. రెండు భాగాలుగా SSMB 29 రానుందని.. 2026లో ఫస్ట్ పార్ట్ రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్ తో కేఎల్ నారాయణ నిర్మిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాతో రాజమౌళి మరోసారి రూ.1000 కోట్ల క్లబ్ టార్గెట్ ను పెట్టుకున్నట్లు తెలుస్తుంది. కానీ జక్కన్న లక్ష్యం అది కాదని అంటున్నారు.
Read Also:Sydney Test: భారత్ ఘోర ఓటమి.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకున్న ఆసీస్
ఎందుకంటే రాజమౌళి.. ఇప్పటికే బాహుబలి-2, ఆర్ఆర్ఆర్ సినిమాలతో రూ.1000 కోట్ల క్లబ్ లోకి రెండు సార్లు ఎక్కారు. దక్షిణాది నుంచి అడుగుపెట్టిన తొలి డైరెక్టర్ గా ఘనత సాధించారు. దానికి తోడు రాజమౌళి తాను ఏం చేసినా.. అంతా ఒక్కసారిగా షేక్ అయ్యేలా చేయాలని చూస్తుంటారన్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు రాజమౌళి SSMB 29 మూవీతో రూ.3వేల కోట్ల మార్క్ అందుకోవాలని టార్గెట్ ను పెట్టుకున్నారని వార్తలు వస్తున్నాయి. అలా జరగాలంటే పాన్ వరల్డ్ బెల్ట్ లో భారీ వసూళ్లను రాబట్టాలి. అందుకు తగ్గ ప్రమోషన్స్ నిర్వహించి.. ప్రపంచ దేశాలు తిరిగి అక్కడి ఆయా స్టేట్స్ ఆడియన్స్ ను మూవీకి కనెక్ట్ అయ్యేలా చేయాలి.