
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదగాలని ఎంతో మంది ముద్దుగుమ్మలు కెరీర్ ప్రారంభిస్తారు. కొందరికి పది సినిమాలైనా క్రేజ్ రాదు, మరికొందరికి ఒక్క హిట్ తోనే గుర్తింపు వస్తుంది. కానీ స్టార్డమ్ ను మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు.
దీక్షా సేత్ అచ్చమైన ఉదాహరణ. 2010లో వేదం సినిమాలో అల్లు అర్జున్ రిచ్ గర్ల్‌ఫ్రెండ్ గా నటించి ఆకట్టుకుంది. తర్వాత ప్రభాస్ “రెబల్” సినిమాలో హీరోయిన్ గా మెరిసింది. గోపీచంద్ “వాంటెడ్,” రవితేజ “మిరపకాయ,” “నిప్పు” లాంటి హిట్ చిత్రాల్లో నటించింది.
అయితే, 2012లో “ఊ కొడతార ఉలిక్కిపడతారా” సినిమాతో టాలీవుడ్‌లో ఆమె కెరీర్ స్లో అయిపోయింది. ఆఫర్స్ తగ్గిపోవడంతో బాలీవుడ్ లో “లేకర్ హమ్ దివానా దిల్” మరియు “ది హౌస్ ఆఫ్ ది డెడ్ 2” సినిమాలు చేసింది. కానీ అక్కడ కూడా ఫెయిల్యూర్ ఎదురైంది.
ఇంతటితో ఆగకుండా కన్నడ సినిమాల్లో కూడా ప్రయత్నించినా, ఆశించిన ఫలితం రాలేదు. ఫలితంగా సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి, లండన్ వెళ్లిపోయింది. ప్రస్తుతం ఐటీ ఫీల్డ్ లో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం.
తొలి సినిమాతోనే టాలీవుడ్ కుర్రకారుకు క్రష్ గా మారిన దీక్షా సేత్, ఇప్పుడు వెండితెరకు దూరమైపోయినా, అభిమానులు ఆమెను మర్చిపోలేకపోతున్నారు. మరి ఆమె రీ ఎంట్రీ ఇస్తుందా? వేచి చూడాలి!