తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు ఈ రోజు ఉదయం భేటీ అయ్యారు. సినీ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు నేతృత్వంలో 36 మంది సభ్యులతో సమావేశం.. భేటీకి హాజరైన దిల్ రాజు, అల్లు అరవింద్, నాగార్జున, వెంకటేష్, సీ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, కొరటాల శివ, బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి, ప్రశాంత్ వర్మ, రాఘవేంద్రరావు, కిరణ్ అబ్బవరం, ఎలమంచిలి రవి తదితరులు హాజరయ్యారు.

ఈ భేటీకి సంబందించి ఎవరికి తోచిన విధంగా వారు అసత్య వార్తలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు కీలక సూచనలు చేసారు. ఆయన మాట్లాడుతూ ” సీఎం తో భేట్ అయిన తరువాత పలు మాధ్యమాల్లో ఫేక్ వార్తలు ప్రసారం అవుతున్నాయి. సీఎం మీటింగ్ లో అసలు జరగని వి కూడా జరిగినట్టు వార్తలు వేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ చాలా బాగా జరిగింది. 0.5 పర్సెంట్ కూడా నెగిటివ్ లేదు. సినీ ఇండస్ట్రీ పట్ల చాలా సానుకూలంగా ఉన్నారు. బెనిఫిట్స్ షోలు టిక్కెట్ రేట్స్ గురించి అసలు టాపిక్ రాలేదు.  పోలీసులు సంధ్య థియేటర్ దగ్గర జరిగిన వీడియో లు మాకు ప్రదర్శించలేదు. బౌన్సర్స్ విషయాన్ని మాకు డీజీపీ చెప్పారు ప్రతిదీ అకౌంట్ బిలిటీగా ఉండాలి అని డీజీపీ సూచించారు. హాలీవుడ్ సినిమాలు కూడా హైదరాబాద్ లో షూటింగ్ జరిపేలా అభివృద్ధి చేద్దాం అన్నారు. హైదరాబాద్ కు ఐటీ ఫార్మా రంగాలు ఎంత కీలకమో సినీ పరిశ్రమకూడా అంతే కీలకం గా భావిస్తున్నట్టు సీఎం చెప్పారు. సామాజిక సేవ కార్యక్రమాల్లో సెలబ్రటీలు పాల్గొనాలి అని చెప్పారు. అలాగే గద్దర్ అవార్డ్స్ ను FDC తో అనుసంధానంగా జరగాలి అని చెప్పారని’ అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *