Dil Raju : శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్‌రాజు.. సమస్యను పరిష్కరించేందుకు బాధ్యత తీసుకుంటా

  • శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్‌రాజు. శ్రీతేజ్‌ త్వరగా రికవరీ అవుతున్నాడు. రేపు లేదా ఎల్లుండి సీఎం రేవంత్‌ను కలుస్తాం. రేవతి కుటుంబానికి అండగా ఉంటాం. కావాలని ఇలా ఎవరైనా చేస్తారా..? రేవతి కుటుంబం కూడా వినోదం కోసమే థియేటర్‌కు వెళ్లారు. -దిల్‌రాజు సమస్యను పరిష్కరించేందుకు FDC ఛైర్మన్‌గా బాధ్యత తీసుకుంటా.

Dil Raju : సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుమారుడు శ్రీతేజ కిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. అయితే.. ఇవాళ శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు పరామర్శించారు. ఈ సందర్భంగా దిల్‌ రాజు మాట్లాడుతూ.. పుష్ప ప్రీమియర్ షో సమయంలో జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు. ఇలాంటివి సినిమా ఇండస్ట్రీ లో అప్పుడప్పుడు చూస్తుంటామన్నారు. ప్రభుత్వానికి, సినిమా కి వారధిలా ఉండాలని నన్ను FDC చైర్మన్ గా ఈమధ్య నియమించారని, యూఎస్‌లో ఉన్నాను వేరే ప్రోగ్రాంలో.. నిన్న వచ్చాను… ఇవ్వాళ రాగానే సీఎం రేవంత్ నీ కలిశాను… రేవతి భర్త భాస్కర్ నీ ఇండస్ట్రీ కి తీసుకుని వచ్చి ఏదోక జాబ్ ఏర్పాటు చేస్తాం అని దిల్‌ రాజు వెల్లడించారు. వాళ్ల బాధ్యత నేను తీసుకుంటానని ఆయన అన్నారు.

YS Jagan: ఏ సమస్య వచ్చినా అండగా ఉంటా.. కడప కార్పొరేటర్లతో వైఎస్ జగన్ భేటీ

FDC ద్వారా వీరికి ఏవిధమైన సహకారం అందించగలిగితే అవి అందిస్తామని, ప్రభుత్వానికి ఇండస్ట్రీ కి మధ్యలో ఉండి… భాస్కర్ కుటుంబాన్ని మేము బాధ్యత తీసుకుంటామన్నారు. శ్రీ తేజ ఆరోగ్యం కుదుట పడుతుందని, సీఎం ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగిందన్నారు దిల్‌ రాజు. సీఎం రేవంత్ తో కూడా వీరి బాధ్యత తీసుకోవడం పై చర్చించాను… ఒకే అన్నారని ఆయన పేర్కొన్నారు. ఇటువంటివి జరగటం దురదృష్టకరమని, ఎవ్వరూ కావాలని చేయరన్నారు. నేను అల్లు అర్జున్ నీ కలవబోతున్నానని, టెక్నికల్ గా భాస్కర్‌కు జరిగేవి అన్ని జరుగుతాయన్నారు. మేము రేవతి కుటుంబానికి అండగా నిలబడుతామని దిల్‌ రాజు వెల్లడించారు.

HYDRA: ఎన్ఆర్ఎస్సీ కార్యాలయానికి హైడ్రా కమిషనర్.. శాటిలైట్ ఇమేజీలు పరిశీలన

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *