గేమ్ చేంజర్, సంక్రాంతి వస్తున్నాం సినిమాల నిర్మాత దిల్ రాజు సంక్రాంతి సందర్భంగా గేమ్ చేంజర్‌ను జనవరి 10న, సంక్రాంతికి వస్తున్నాం సినిమాను జనవరి 14న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘గేమ్ చేంజర్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో చాలా సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. ఈవెంట్‌కు రావడం ఆనందంగా అనిపించింది. అలా జరిగేందుకు కారణం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌గారు. ఆయన మా అడిగిన వెంటనే ఈవెంట్‌కు వచ్చారు. నా లైఫ్‌లోనే ఇది అద్భుతమైన ఈవెంట్. మెగాభిమానులు, జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్‌గారి అభిమానులు అందరూ సపోర్ట్ చేశారు. నేను ఇంత ఎనర్జీ తెచ్చుకోవడానికి కారణం పవన్ కళ్యాణ్‌గారే’’ అని దిల్ రాజు అన్నారు.
ఆయన పది సంవత్సరాల రాజకీయ ప్రయాణం గురించి మాట్లాడతూ, ‘‘పవన్ కళ్యాణ్ 12 ఏళ్ల క్రితం తన కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పటికీ రాజకీయాల్లోకి వెళ్లారు. ఆ సమయంలో చాలామంది అనుకున్నారు, ‘ఇంత ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లడం అవసరమా?’ కానీ ఆయన పదేళ్ల ప్రయాణాన్ని చూస్తే, మనలో కొత్త ఎనర్జీ వస్తుంది. రాజకీయాల్లోకి వెళ్లి, ఆ ప్రయాణంలో అంచెలంచెలుగా ఎదుగుతూ, తిరిగి సినిమాల్లోకి వచ్చారు’’ అని చెప్పారు.
దిల్ రాజు, ‘‘పవన్ కళ్యాణ్ విజయం ఇప్పుడు గేమ్ చేంజర్‌లా కనిపిస్తుంది. ఆయన కూటమిలో 21 సీట్లు గెలవడం ఆయన గెలిచిన విధానాన్ని చాటుతుంది. ఆయనను చూసి నేను నేర్చుకున్నాను, ‘నేను ఫెయిల్ అవుతున్నాను’ అని ఆగిపోకూడదని భావించాను. పవన్ కళ్యాణ్‌గారి ప్రేరణతోనే నేను నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను’’ అని తెలిపారు.
ఇటీవల “వకీల్ సాబ్” సినిమా గురించి మాట్లాడుతూ, ‘‘పవన్ కళ్యాణ్‌గారితో సినిమా చేయాలనుకున్నాను. ఆయనతో మాట్లాడి, సినిమా అన్ని వర్గాల ప్రజలందరికీ చేరుతుందని నాకు బాగా నమ్మకం ఉంది. ఆయన నా మాటలను నమ్మి, ఈ సినిమాను చేయడానికి అంగీకరించారు’’ అని తెలిపారు.
అలాగే, ‘‘వకీల్ సాబ్ సినిమా రెమ్యునరేషన్లు జనసేన పార్టీకి ఇంధనంగా ఉపయోగపడ్డాయని నాకు తెలియదు. పవన్ కళ్యాణ్‌గారు ఆ విషయం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆ గొప్ప స్టేజ్‌పై ఆయన పబ్లిక్‌గా అన్నప్పుడు చాలా ఎమోషనల్‌గా అనిపించింది. ఒక డిప్యూటీ సీఎం, నాయకుడిగా ఉండి ఆయన ఇలా మాట్లాడటం వాస్తవంగా నన్ను గౌరవపరచింది’’ అని దిల్ రాజు పేర్కొన్నారు.