యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న సినిమా “దిల్ రూబా”. ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. “దిల్ రూబా” సినిమా ఫిబ్రవరిలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – “దిల్ రూబా” గురించి మాట్లాడేముందు ఫస్ట్ మా ప్రొడక్షన్ హౌస్ సారెగమా వారికి థ్యాంక్స్ చెప్పాలి. తెలుగులో వారి ఫస్ట్ మూవీలో నేను హీరో కావడం సంతోషంగా ఉంది. నన్ను, మా టీమ్ ను వారు ఎంతో బాగా చూసుకున్నారు. డైరెక్టర్ కరుణ్ నాకు మూడేళ్లుగా తెలుసు. ఒకరోజు వచ్చి కథ చెప్పాడు. అతను కథ చెప్పే విధానం చాలా కొత్తగా అనిపించింది. “దిల్ రూబా” సినిమాలో నేను చేసిన సిద్ధు, సిద్ధార్థ్ క్యారెక్టర్ చాలా స్పెషల్ గా హార్డ్ హిట్టింగ్ గా ఉంటుంది. తను నమ్మిన సిద్ధాంతం కోసం ప్రేమతో సహా ఏ విషయంలోనైనా వెనక అడుగు వేయడు. తన నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం కట్టుబడి ఉంటాడు. అలాంటి సిద్ధార్థ్ లు మీలోనూ ఉంటారు. అలాంటి క్యారెక్టర్ ఉన్న వారందరికీ “దిల్ రూబా” బాగా నచ్చుతుంది. “దిల్ రూబా” నా కెరీర్ లో బెస్ట్ ఆల్బమ్. సామ్ సీఎస్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఫిబ్రవరిలో “దిల్ రూబా” సినిమాను రిలీజ్ చేయబోతున్నాం. హీరో నమ్మే సిద్ధాంతం చాలా కొత్తగా ఉంటుంది. క సినిమా తర్వాత నా మూవీస్ మీద ఆడియెన్స్ పెట్టుకున్న అంచనాలను “దిల్ రూబా” తప్పకుండా అందుకుంటుంది.