ఈ దీవాళికి బాక్సాఫీసును ఆక్యుపై చేస్తున్నారు నలుగురు యంగ్ అండ్ డైనమిక్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, కిరణ్ అబ్బవం, ప్రియదర్శి అండ్ ప్రదీప్ రంగనాథన్. లాస్ట్ ఇయర్ టిల్లు స్క్వేర్‌తో హిట్ కొట్టేసి సిద్దు ఈ ఏడాది జాక్ అంటూ ప్రేక్షకులకు క్రాక్ తెప్పించాడు. ఫెయిల్యూర్ నుండి గట్టెక్కేందుకు తనకు అచ్చొచ్చిన రొమాంటిక్ కామెడీ తెలుసుకదాతో వస్తున్నాడు. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టితో ట్రయాంగిల్ లవ్ స్టోరీని ప్రజెంట్ చేయబోతున్నాడు టిల్లు. కాస్ట్యూమ్ డిజైనర్‌గా పాపులరైన నీరజ కోన ఈ సినిమాతో ఫస్ట్ టైం మెగా ఫోన్ టచ్ చేయబోతోంది. అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది తెలుసు కదా.
గత దీపావళి టైంలోనే ‘క’తో సక్సెస్ అందుకున్న కిరణ్ అబ్బవరం ఈ ఏడాది దిల్ రుబాతో వస్తే ప్రేక్షకులు తిప్పికొట్టారు. ‘క’ అక్షరం కలిసిరావడంతో పాటు దీపావళి సెంటిమెంట్ క్యాష్ చేసుకునేందుకు కెర్యాంప్‌తో వచ్చేస్తున్నాడు. రాజేష్ దండా నిర్మాతగా వ్యవహరిస్తున్న అక్టోబర్ 18న థియేటర్లలో రిలీజౌతుంది. ఈ ఇద్దరి కన్నా ముందే ప్రియదర్శి ‘మిత్రమండలి’గా రాబోతున్నాడు. మోహన్ లాల్ అక్టోబర్ 16న క్విట్టైతే మిత్రమండలి ఆ డేట్‌ను ఆక్యుపై చేసింది. విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహారా కీ రోల్స్ చేస్తుండగా సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్సర్ నిహారిక ఎన్ఎం హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అవుతుంది. ఈ ముగ్గురు టాలీవుడ్ హీరోలే కాదు తమిళబ్బాయి ప్రదీప్ రంగనాథన్ కూడా ఈ దీపావళి రేసులో పోటీ పడుతున్నాడు. ఈ ఏడాది యూత్ ఫుల్ స్టోరీ డ్రాగన్‌తో భారీ హిట్ అందుకున్న జూనియర్ ధనుష్ మరోసారి తన మార్క్ మూవీ డ్యూడ్ తో పలకరించబోతున్నాడు. మమితా బైజు హీరోయిన్ కాగా, నేహా శెట్టి కీ రోల్ ప్లే చేస్తున్న ఈ ఫిల్మ్ అక్టోబర్ 17 నుండి సందడి చేయబోతుంది. కీర్తిశ్వరన్ న్యూ డైరెక్టర్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ కాబోతుండగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. మరి ఈ యంగ్ హీరో, న్యూ డైరెక్టరల్లో దీపావళి ఎవరి జీవితాల్లో వెలుగులు నింపుతుందో చూడాలి.