
తమిళ దర్శకుడు అశ్వత్ మారిముత్తు తన మనసులోని కోరికను బయటపెట్టారు – అది మరేదో కాదు, సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో సినిమా తీయడం. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ, మహేశ్ ఎందుకు తనకు స్పెషల్ అని, ఆయనతో సినిమా చేసే తన కోరిక వెనుక కారణాన్ని వివరించారు.
2020లో అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో వచ్చిన ‘ఓష్ మై కడవలే’ అనే చిన్న బడ్జెట్ మూవీపై మహేశ్ బాబు ట్విట్టర్‌లో ప్రశంసలు కురిపించారు. మహేశ్ చేసిన ఆ పోస్ట్ వల్ల, అశ్వత్ సోషల్ మీడియా అకౌంట్ ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చిందని, అప్పుడు తనకు పెద్ద షాక్ తగిలిందని ఆయన తెలిపారు. మూడుకోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ చిన్న సినిమా గురించి మహేశ్ స్వయంగా ప్రశంసించడం, టాలీవుడ్‌లో పలువురు దర్శకులు, నటీనటులు దీన్ని చూసి మెచ్చుకోవడం తనకు ఆనందాన్నిచ్చిందని చెప్పారు.
ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ హీరోగా, ‘డ్రాగన్’ అనే కొత్త సినిమా తీసిన అశ్వత్ మారిముత్తు, తమిళంతో పాటు తెలుగు ఇండస్ట్రీలో తన గుర్తింపు పెంచుకుంటున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 21న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మహేశ్‌తో సినిమా చేసే తన కలను పబ్లిక్‌గా ప్రకటించారు.
ఇప్పటివరకు మహేశ్ నుంచి దీనిపై ఎలాంటి స్పందన రాలేదు. కానీ, మహేశ్ ఒక ఛాన్స్ ఇస్తే తాను అతనికి గొప్ప కథ అందిస్తానని అశ్వత్ విశ్వాసం వ్యక్తం చేశారు. మహేశ్ బాబు ఈ యంగ్ డైరెక్టర్‌కు అవకాశం ఇస్తారో లేదో చూడాలి.