యూఎస్ లో “డాకు మహారాజ్” బుకింగ్స్ మొదలు.. | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

నటసింహం బాలయ్య – దర్శకుడు బాబీ కాంబినేషన్‌ లో “డాకు మహారాజ్” సినిమా సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఇందులో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాబీ ఈ సినిమాలో మెయిన్ హైలైట్స్ ను రివీల్ చేశారు. బాబీ మాట్లాడుతూ.. ‘డాకు మహారాజ్’లో ఒక ఫైవ్ టు సిక్స్ సాలిడ్ ఎపిసోడ్స్ ఉంటాయి. ముఖ్యంగా బాలకృష్ణ గారి సినిమా నుంచి ఏదైతే కోరుకుంటారో.. అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి. అదేవిధంగా బాలయ్య పాత్రలో మూడు వేరియేషన్స్ ఉంటాయి. ఆ మూడో వేరియేషన్ కోసం బెస్ట్ ఎపిసోడ్ ని డిజైన్ చేయడం జరిగింది. నా దృష్టిలో అది సినిమాలోనే మెయిన్ హైలైట్’ అని చెప్పుకొచ్చారు.

దర్శకుడు బాబీ ఇంకా మాట్లాడుతూ.. ‘యాక్షన్ ఒక్కటే కాదు, వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఈ సినిమాలో ఉంటాయి. బాలకృష్ణ గారి పాత్రలో అద్భుతమైన ఎమోషన్ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో ఓ ముప్పై నిమిషాల ఎపిసోడ్ కూడా చాలా బాగుంటుంది. ఒక్క మాటలో ‘డాకు మహారాజ్’లో అద్భుతమైన యాక్షన్ తో పాటు ఇంత బ్యూటిఫుల్ ఎమోషన్ ఎలా పండించారు ? అని మీరు అడుగుతారు’ అంటూ బాబీ చెప్పుకొచ్చారు. ఇక “డాకు మహారాజ్” సినిమా జనవరి 12, 2025న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగ వంశీ, ఫార్చూన్‌ ఫోర్ సినిమాపై సాయి సౌజన్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

The post ‘డాకు మహారాజ్’లో మెయిన్ హైలైట్స్ అవే ! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *