పిక్ టాక్: డాక్టర్‌ ప్రీతి చల్లాను వివాహం చేసుకున్న దర్శకుడు క్రిష్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Nov 11, 2024 5:49 PM IST

టాలీవుడ్ దర్శకుడు క్రిష్ ప్రస్తుతం అనుష్క శెట్టి మెయిన్ లీడ్‌లో నటిస్తున్న ‘ఘాటి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే, క్రిష్ పర్సనల్ లైఫ్ గురించి గతకొద్ది రోజులుగా ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. ఆయన రెండో వివాహం చేసుకోబోతున్నాడనే టాక్ సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. అయితే, ఇప్పుడు ఈ వార్త నిజం అయ్యింది.

హైదరాబాద్‌కి చెందిన డాక్టర్ ప్రీతి చల్లాను దర్శకుడు క్రిష్ నేడు వివాహం చేసుకున్నాడు. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. అయితే, వీరి పెళ్లికి సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దర్శకుడు క్రిష్ పెళ్లి వార్త విని అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇక ఈ నూతన జంటకు టాలీవుడ్ ప్రముఖులు కూడా తమ విషెస్ చెబుతున్నారు. అయితే, క్రిష్ గతంలో డాక్టర్ రమ్యను వివాహం చేసుకున్నాడు. కొన్ని కారణాల వల్ల వారిద్దరూ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *