- దర్శకుడు రాంగోపాల్ వర్మకు మరోసారి ఊరట..
- ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ..
- వర్మపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దన్న ఆదేశాలు పొడిగింపు..
Ram Gopal Varma: దర్శకుడు రాంగోపాల్ వర్మకు మరోసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది.. ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. రాంగోపాల్ వర్మపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలు పొడిగించింది.. గతంలో ఇచ్చిన ఆదేశాలను మళ్లీ శుక్రవారం వరకు పొడిగిస్తూ ఆదేశాలిచింది.. ఇక, ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్ పై రేపు విచారణ జరపనుంది ఏపీ హైకోర్టు..
Read Also: Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా ఎప్పుడో తెలుసా? ఈ సారి భక్తులకు కొత్త సౌకర్యాలు
కాగా, తనపై నమోదైన కేసులను కొట్టివేయాలంటూ హైకోర్టు మెట్లు ఎక్కిన ఆర్జీవీకి మొదట ఎదురుదెబ్బ తగిలిన విషయం విదితమే కాగా.. ఆ తర్వాత ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు.. అంతేకాదు.. తనకు థర్డ్ డిగ్రీ భయాలు కూడా ఉన్నాయని తన ముందస్తు బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే.. ఇక, తనపై కావాలనే కేసులు పెడుతున్నారని కూడా హైకోర్టును ఆశ్రయించారు ఆర్జీవీ. దీంతో వారం క్రితం వర్మకు ఊరట కల్పిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.. వర్మపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని పేర్కొంది.. మరోవైపు వర్మపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. తాజాగా, కోర్టులో విచారణ జరిపి.. గతంలో వర్మకు ఊరట కల్పిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను శుక్రవారం వరకు పొడిగించింది. అంతేకాదు.. వర్మపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని గతంలో చెప్పిన వ్యాఖ్యలను మరోసారి కోర్టు ఆదేశించింది.