Published on Oct 28, 2024 10:30 AM IST
ఇటీవల మన తెలుగు సినిమా దగ్గర వచ్చి మంచి టాక్ ని సంతరించుకున్న ఎమోషనల్ చిత్రాల్లో దర్శకుడు రమేష్ చెప్పాల తెరకెక్కించిన సినిమా “లగ్గం” కూడా ఒకటి. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు చివరి 40 నిమిషాలకి ఎంతో ఎమోషనల్ అయ్యారని అలాగే క్లైమాక్స్ అదిరిపోయింది, ఫీల్ గుడ్ మూవీ అంటూ కాల్స్, మెసేజ్లు చేస్తున్నారు అని దర్శకుడు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే ఈ రోజుల్లో ప్రేక్షకులు సినిమా బాగుంది అనడం చాలా పెద్ద విషయం. అలాంటిది అన్ని చోట్ల నుంచి మంచి టాక్ రావడం ఆనందంగా ఉంది. ఒక మంచి సినిమా తీశాను. దాన్ని ప్రజల ముందు ఉంచాను. ఇక జయాపజయాలు దైవ దినం అని నమ్ముతాను. ఇది నా కెరీర్ బెస్ట్ ఫిలిం అని తెలిపారు.
అలాగే ఈ సినిమా నిర్మించిన నిర్మాత సుబిషి ఎంటర్టైన్మెంట్స్ వేణుగోపాల్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు. సినిమా నిర్మాణంలో నిర్మాత ప్రోత్సాహం మర్చిపోలేనిది. వేణుగోపాల్ రెడ్డి గారు విలువలు ఉన్న మనిషి. ఈరోజు ఇంత మంచి టాక్ రావడం వెనుక నాతో పాటు కలిసి నడిచిన నా టీం అందరికీ కృతజ్ఞతలు. ప్రేక్షకులకు నా విజ్ఞప్తి సినిమా మీ అభిమాన థియేటర్లో నడుస్తోంది మీరు మీ కుటుంబంతో వెళ్లి చూడండి. ఒక చక్కని అనుభూతికిలోనవుతారు. పదిమందికి చెప్తారు అంటూ తన సినిమా కోసం కామెంట్స్ చేశారు.
అలాగే తనకి ఇండస్ట్రీ ప్రముఖులు ఫోన్ చేసి “సినిమా అంటే ఇది అనేలా ఉంది ఈ సినిమా, మనల్ని మనకే కొత్తగా పరిచయం చేసింది ఈ సినిమా…” అంటూ ఒకరు. “నన్ను మా ఊరు తీసుకెళ్ళింది, చిన్ననాటి స్మృతులని గుర్తు చేయించింది, ఫ్యామిలీ బంధాలలోని తియ్యదనం రుచి చూపించింది, బాధల్ని మరిపించింది, బాధ్యతల్ని గుర్తుచేస్తుంది, మొత్తంగా మనం మనుషులం అని గుర్తు చేస్తుంది ఈ సినిమా” అన్నారు ఓ ప్రముఖ నిర్మాత.
అలానే కొందరు “మనం సినిమా చేద్దాం” అని అడగడం కూడా నాకు ఆనందం వేసింది. నేను ప్రాణం పెట్టి చేసిన లగ్గం సినిమాకు ఇంత అప్లాజ్ రావడం. అది మీతో పంచుకోవడం సంతోషంగా ఉంది. అందరికీ పేరుపేరునా నా కృతజ్ఞతలు అంటూ దర్శకుడు రమేష్ చెప్పాల ఆనందం వ్యక్తం చేశారు.