
తెలుగు సినీ పరిశ్రమలో దివి తనదైన గుర్తింపును తెచ్చుకుంది. మోడలింగ్ నుంచి బిగ్ బాస్ వరకు ఎన్నో ప్రయాణాలు చేసిన ఈ బ్యూటీ, ఇప్పుడు టాలీవుడ్లో మంచి అవకాశాలు అందుకుంటోంది. మహర్షి సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన దివి, ఆ తర్వాత ఏ1 ఎక్స్‌ప్రెస్, జిన్నా వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఆమెకు బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ప్రత్యేకమైన పాపులారిటీ లభించింది.
బిగ్ బాస్ హౌస్‌లో దివి స్టైల్, గ్లామర్, వినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. షో ముగిసిన తర్వాత పలు టాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ, మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కీలక పాత్ర పోషించే ఛాన్స్ కొట్టేసింది. అలాగే, పుష్ప 2, డాకు మహారాజ్ వంటి బిగ్ ప్రాజెక్టుల్లో నటిస్తూ తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది.
తాజాగా, దివి కోయ జాతి అమ్మాయిగా మారిపోయి అభిమానులకు షాకిచ్చింది. ట్రైబల్ లుక్‌లో కనిపించిన ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎప్పుడూ మోడ్రన్ స్టైల్లో కనిపించే ఈ బ్యూటీ, ఇప్పుడు అమ్మాయిగా ట్రెడిషనల్ అవతార్ ట్రై చేయడం ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచింది.
ప్రస్తుతం దివి కెరీర్ టాప్ గేర్‌లో ఉంది. ప్రముఖ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు ఆమెను మరింత టాప్ హీరోయిన్గా మార్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. త్వరలోనే దివి కొత్త ప్రాజెక్టులపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని సమాచారం!