
దివ్య భారతీ, కోలీవుడ్‌లో ‘బ్యాచిలర్’ సినిమాతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించి, తన మొదటి సినిమాతోనే యువతను ఆకట్టుకుంది. జీవీ ప్రకాష్ సరసన నటించిన ఈ చిత్రం, ఆమెకు పెద్ద గుర్తింపును తీసుకొచ్చింది. ఈ సినిమా విజయంతో, ఆమెకు వరుస అవకాశాలు దక్కాయి.
1992 జనవరి 28న జన్మించిన దివ్య భారతీ, తన అభినయం, అందంతో ప్రేక్షకులను మెప్పిస్తోంది. ‘మధిల్ మెల్ కాదల్’, ‘కింగ్‌స్టన్’, ‘ఆసై’, ‘మహారాజా’ వంటి చిత్రాల్లో నటించి తమిళ ప్రేక్షకుల్ని మెప్పించిన ఆమె, ఇప్పుడు ‘G.O.A.T – Greatest Of All Time’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెడుతోంది. సుడిగాలి సుధీర్ సరసన నటిస్తున్న ఈ సినిమా పోస్టర్లు, పాటలు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
తెలుగు పరిశ్రమలో ఇది దివ్య భారతీ తొలి చిత్రం కావడంతో, అందరూ భారీ అంచనాలు పెట్టుకున్నారు. షూటింగ్ పూర్తికావొచ్చిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ చిత్రం విజయవంతమైతే, ఆమెకు తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.
ఇటీవల, జీవీ ప్రకాష్‌తో కలిసి ఆమె నటించిన ‘కింగ్‌స్టన్’ సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. అలాగే, ఆమె సోషల్ మీడియా పోస్టులు వైరల్ అవుతున్నాయి. తను షేర్ చేసిన ఫోటోలు, ఆమె అందాన్ని, స్టైలిష్ లుక్‌ను మరోసారి ప్రూవ్ చేశాయి. దివ్య భారతీ టాలెంట్, గ్లామర్, నటన ఆమెను దక్షిణాది సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా మార్చుతాయని అభిమానులు ఆశిస్తున్నారు.